![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -807 లో.....రాజ్ కి నిజం చెప్పి కావ్యని తన దృష్టిలో బ్యాడ్ చెయ్యడానికి రుద్రాణి అనుకుంటుంది. రాజ్ దగ్గరికి రుద్రాణి వచ్చి.. నువ్వు అమెరికా వెళ్లొద్దని చెప్తుంది కావ్య.. నిన్ను వద్దనడానికి కారణం కావ్య ఇప్పుడు ప్రెగ్నెంట్ అని రుద్రాణి చెప్తుంది. అది విని రాజ్ షాక్ అవుతాడు. అప్పుడే కావ్య వస్తుంది. మీకోక విషయం చెప్పాలని రాజ్ తో కావ్య అనగానే మీరు ప్రెగ్నెంటా అని రాజ్ అడుగుతాడు.
దాంతో కావ్య షాక్ అవుతుంది. రుద్రాణి వంక చూస్తుంది. రాజ్ ని ఎలా ఆపాలో తెలియక నిజం చెప్పేసానని రుద్రాణి అంటుంది. నువ్వు ప్రెగ్నెంటా అని కావ్యని రాజ్ అడుగుతాడు. దానికి సమాధానంగా కావ్య అవునని చెప్తుంది. మీరంతా ఫ్రాంక్ చేస్తున్నారు కదా అని రాజ్ నవ్వుకుంటాడు. నిజమే చెప్తున్నాను నమ్మండి అని కావ్య అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అపర్ణ, ఇందిరాదేవి దగ్గరికి రాజ్ వచ్చి అడుగుతాడు. వాళ్ళు కూడ నిజమే అని చెప్తారు. ఎందుకు నన్ను ఇంత మోసం చేశారు.. ఇన్ని రోజులు తన వెంటపడుతుంటే ఎందుకు ఎంకరేజ్ చేసారని రాజ్ వాళ్లపై కోప్పడతాడు. అసలు కావ్య ప్రెగ్నెంట్ కి ఎవరు కారణం అని రాజ్ వాళ్ళని అడుగుతాడు. వాళ్ళు మౌనంగా ఉంటారు. నాకు తన మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉందని రాజ్ వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత రాజ్ డల్ గా ఉండడం తో యామిని పేరెంట్స్ వెళ్లి యామినిని పెళ్లి చేసుకోమని అంటారు. లేదు నేను చేసుకోను.. కావ్య నన్ను మోసం చేసింది కానీ తప్పు చెయ్యలేదని నమ్ముతున్నానని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో కావ్య దగ్గరికి రాజ్ వచ్చి అసలు నీ కడుపుకి కారణం ఎవరు అంటూ తప్పుగా మాట్లాడుతుంటే.. రాజ్ చెంప చెల్లుమనిపిస్తుంది అపర్ణ. ఆ కడుపుకి కారణం నువ్వేరా నువ్వు తన భర్తవి.. నా కొడుకువి అని అపర్ణ చెప్పగానే రాజ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |